Drinker Escapes With Police Body Camera : డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించి వారి బాడీ కెమెరా పరికరాన్ని కొట్టేసి పరారయ్యాడు ఓ మందుబాబు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇదీ కథ: నగరంలోని హైదర్‌గూడలో ఓ ఇద్దరు బైక్‌పై వెళ్తున్నారు. వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. అయితే ఈ ఇంతలోనే వారికి మందుబాబులు ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చారు. బైక్‌పై కూర్చున్న మరో వ్యక్తి ట్రాఫిక్ పోలీసుకు ఉన్న బాడీ కెమెరా పరికరాన్ని పట్టుకుని పారిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పైగా బాడీ కెమెరా పోవడంపై కేసు సైతం నమోదు చేశారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు నాలుగు రోజులుగా నగరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పోలీసుల నుంచి బాడీ కెమెరాను కొట్టేసిన మందుబాబులు వాడిన బైక్ నెంబర్ వేరొక ద్విచక్ర వాహనానిది అని అనుమానిస్తున్నారు. అంతేగాక ఓ బైక్ ఒరిజినల్ నెంబర్‌ను ఫేక్‌గా క్రియేట్ చేసి దాన్ని మరో బండికి అతికించి తిరుగుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు.
సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టి ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ - రూ.25 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు