ETV Bharat / state

polavaram: 'పోలవరం ప్రాజెక్టుకు నిధులిచ్చే వరకు పోరాడుతాం'

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు వచ్చే వరకు పార్లమెంట్​లో పోరాడుతామని వైకాపా ఎంపీలు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై 267 నిబంధన కింద చర్చ చేపట్టాలని కోరుతూ వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చారు.

Parliament
పార్లమెంట్​
author img

By

Published : Jul 20, 2021, 8:58 AM IST

కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల మేరకు నిధులు వచ్చే వరకు పార్లమెంట్లో​ పోరాడుతామని పలువురు వైకాపా ఎంపీలు స్పష్టం చేశారు. విజయనగరం, కాకినాడ, నంద్యాల, తిరుపతి ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌, వంగా గీత, పోచ బ్రహ్మానందరెడ్డి, గురుమూర్తి సోమవారం విలేకరులతో మాట్లాడారు.

‘పోలవరం నిధులపై ప్రధానమంత్రి, జల్‌శక్తి మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం దక్కలేదు. సీఎం జగన్‌, లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి సూచనల మేరకు పోలవరం నిధుల విడుదలకు సభలో ఆందోళన చేస్తాం’ - బెల్లాన చంద్రశేఖర్‌ ,ఎంపీ

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా.. తర్వాత తగిన శ్రద్ధ చూపని కారణంగా పనులు నత్తనడకన సాగాయని ఎంపీ వంగా గీత తెలిపారు. ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిధులిచ్చే వరకూ తమ నిరసన కొనసాగుతుందని, విభజన హామీలపై సభలో రోజూ పోరాడతామని ఎంపీ గురుమూర్తి చెప్పారు.

ప్రత్యేక హోదాపై నోటీసు

ప్రత్యేక హోదా అంశంపై 267 నిబంధన కింద చర్చ చేపట్టాలని కోరుతూ వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే రైతు చట్టాల రద్దు, పెట్రో డీజిల్‌ ధరల పెంపు, ఆయా రాష్ట్రాల్లో సమస్యలపై చర్చకు పట్టుపడుతూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చారు. వారితో పాటు వైకాపా సభ్యులు రాగా ప్రత్యేక హోదా అంశం చర్చకు అర్హత ఉన్నా ఈ రోజు అనుమతించలేమని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలు ఎక్కువ కావడంతో ఛైర్మన్‌ సభను వాయిదా వేశారు.

ఇదీ చదవండి:

RAYALSEEMA LIFT: రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు మళ్లీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.