విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రథానికి ఉండే మూడు వెండి సింహం ప్రతిమలు అదృశ్యం కావడం దారుణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు సింహాల ప్రతిమలు ఎక్కడో ఉన్నాయని ఒకసారి, మెరుగు పెట్టేందుకు పంపామని ఒకసారి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్ష్యాత్తు దేవాదాయశాఖ మంత్రి ఇంటి సమీపంలోనే దొంగతనం జరగడం, ఇప్పటి వరకూ ఘటనను గుర్తించకపోవడం చాలా దురదృష్టకరమని ఎంపీ అన్నారు.
ఇదీ చదవండి : దేవాదాయ శాఖ మంత్రిని, ఇంద్రకీలాద్రి ఈవోను తప్పించండి: చంద్రబాబు