ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీలో నాయకులు మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ పశ్ఛిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. ఆచంట మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన మహిళలు ఇంటి స్థలాల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. లబ్ధిదారుల నుంచి 50వేల రూపాయలు వసూలు చేశారని.., ఇదేమని ప్రశ్నిస్తే.. దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంటి స్థలం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.
ఇదీ చూడండి ఈ బుడ్డోడిది మెదడా..? కంప్యూటరా..!