పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చెరుకుమిల్లి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు జరిగాయని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అక్కడ ఉన్న కుర్చీలను విసిరి కొట్టారు. అధికారులను పంచాయితీ కార్యాలయంలోనే అధికారులను నిర్బంధించారు.
ఎప్పటి నుంచో గ్రామంలోని నివసిస్తోన్న తమని కాదని వైకాపాకు అనుకూలంగా ఉన్న వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ లేని సమయంలో అధికారులు ఇళ్ల స్థలాల లాటరీ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆకివీడు తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయారు. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి..
'రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది'