ETV Bharat / state

వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి...! - women died

వైద్యులు సకాలంలో స్పందించని కారణంగా.. మహిళ మృతి చెందిందంటూ తాడేపల్లి ప్రాంతీయ ఆసుపత్రి ఎదుట బాధితులు నిరసన చేపట్టారు. సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్యుల తీరును తప్పుబట్టారు.

వైద్యుల నిర్లక్ష్యం- మహిళ మృతి...!
author img

By

Published : Jun 1, 2019, 10:22 PM IST

వైద్యుల నిర్లక్ష్యం- మహిళ మృతి...!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఇంటి మహిళ మరణించిందంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి ప్రాంతీయ ఆసుపత్రి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన కుమారి.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిందని... విధుల్లో ఉన్న వైద్యుడు వెంటనే చికిత్స అందించకుండా 4 గంటల పాటు జాప్యం చేశాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. అనంతరం నామమాత్రంగా పరీక్షలు నిర్వహించి చికిత్స అందించటం వల్లే కుమారి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం విలువ తెలియని వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంధువుల ఆందోళనతో ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప

Body:రంజాన్ సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో వైకాపా ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు పక్కన ఉన్నది డి సి ఎల్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో నియోజకవర్గం లో ముస్లిం మైనారిటీ లు పాల్గొన్నారు విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తోపాటు కడప ఎమ్మెల్యే అంజాద్బాష వైకాపా కడప పార్లమెంటు విభాగ అధ్యక్షుడు సురేష్ బాబు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి తో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.