పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం నుంచి భీమవరం వరకు రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రైతులకు నష్టం కలిగించే మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను, విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా భీమవరం పాత బస్టాండ్ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. రాష్ట్ర రైతు సంఘం నాయకుడు నాగేంద్రనాథ్, ఆల్ ఇండియన్ రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలు రైతులు మనుగడకే ప్రశ్నార్థకంగా మారతాయని అన్నారు. వెంటనే తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: