ETV Bharat / state

"నివేదిక వచ్చాక... పోలవరంలో ఎంత మిగిలిందో చెప్తాం"

పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో నివేదిక పంపాల్సిందింగా రాష్ట్ర ప్రభుత్వానికి రిమైండర్‌ పంపామన్న కేంద్రమంత్రి నివేదిక అందాక, తర్వాతి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పోలవరం
author img

By

Published : Oct 14, 2019, 5:33 AM IST

కేంద్రమంత్రితో ఏపీ భాజపా నాయకుల బృందం భేటీ

పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలంటూ, రాష్ట్ర భాజపా నేతలు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. ప్రాజెక్టుకు సంబంధించి 2017-18 సవరించిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడ లేదా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే సీఈవోని నియమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ, కేంద్ర జలశక్తి శాఖల మధ్య సమన్వయానికి పర్యవేక్షణ కమిటీని నియమించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై గట్టిగా దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను కేంద్రప్రభుత్వం డిప్యుటేషన్‌పై తీసుకునే అంశాన్ని పరిశీలించాలని మంత్రిని కోరారు. ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తికావాలన్నదే తమ అభిమతమన్న కేంద్రమంత్రి షెకావత్‌.... రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే ప్రాజెక్టు విషయంలో ఒడుదొడుకులు ఎదురవుతున్నాయన్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని తెలిపారు. ఈ విషయంపైనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానన్న ఆయన.. పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించామన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ వల్ల ఎంతమేర సొమ్ము ఆదా అయిందో తెలుస్తుందన్నారు.

జాతీయ ప్రాజెక్టైన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపడుతుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రశ్నించిన జగన్‌.. ఇప్పుడు తన వైఖరేంటో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. నిర్ణీత గడువులోగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు కన్నా తెలిపారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.