పోలవరం ప్రాజెక్టు పనులకు నీరు అడ్డంకిగా మారింది. ప్రధాన నిర్మాణ ప్రాంతమైన స్పిల్ వే వద్ద సుమారు 30అడుగుల లోతుతో కిలోమీటరు పొడవునా నీరు నిలిచింది. గోదావరి వరద సమయంలో స్పిల్ వేపై నీటిని మళ్లించారు. వరద తగ్గినా.. నీరు మాత్రం నిల్వ ఉండిపోయింది. స్పిల్ వే దిగువ ప్రాంతమైన స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్స్ నీటితో నిండిపోయాయి. స్పిల్ వే ఎగువ ప్రాంతంలో నిలిచిన నీటిని రివర్స్ స్లూయిజ్‌ల ద్వారా కిందకు మళ్లించారు. దిగువున ఉన్న ఈ నీటిని మాత్రం ఎటు మళ్లించడానికి వీల్లేకుండా పోయింది. గోదావరి గట్టు అడ్డుగా ఉండటం కారణంగా.. నదిలో కలపడానికి ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం గేట్లనిర్మాణం చేయాలంటే.. కచ్చితంగా ఈ నీటిని తొలగించాల్సి ఉంది.
ఇదీచదవండి