పశ్చిమగోదావరి జిల్లా కలపర్రులో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పర్యటించారు. 85 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిందని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో ఉంటున్నవారు ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు, వాలంటీర్లను కలిసి అక్కడ పింఛన్లు పొందవచ్చన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు అందించే లక్ష్యంతో ఇప్పటికే రెండు కోట్లు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ నివారణకు సహకారం అందించాలని కోరారు.
ఇదీ చూడండి