ETV Bharat / state

నెరవేరని నరసాపురం-సఖినేటిపల్లి వారధి నిర్మాణం - నరసాపురం సఖినేటిపల్లి వారధి నిర్మాణం న్యూస్

దశాబ్దాల సమస్య పరిష్కారానికి శిలాఫలకాలు పడ్డాయి. ఒకరిద్దరు కాదు... ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు.! శిలాఫలకాలు శిథిలమైనా పనులు మాత్రం పట్టాలెక్కలేదు. నిత్యం వందలాదిమంది... పంటుల ద్వారా ప్రయాణించాల్సిందే. గమ్యం చేరేదాకా... ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే! నరసాపురం-సఖినేటిపల్లి వంతెన నిర్మాణం ఉభయగోదావరిజిల్లా వాసులకు కలగానే మిగిలిపోతోంది.

varadgi-problems
author img

By

Published : Nov 20, 2019, 7:03 AM IST

నెరవేరని నరసాపురం- సఖినేటిపల్లి వారధి నిర్మాణం

ఉభయగోదావరిజిల్లాలను వశిష్ఠగోదావరి నది వేరుచేస్తుంది. ఇరుజిల్లాల వాసులు రాకపోకలు సాగించాలంటే.. వశిష్ఠ గోదావరినది దాటాల్సిందే. ప్రధానంగా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లాలోని... కోనసీమ ప్రజల రాకపోకలు సాగించాలంటే.. నదిలో పంటులే సాధానాలుగా మారాయి. వేలమంది వీటి సాయంతోనే... ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ నదిపై వంతెన నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్దాల క్రితమే శిలాఫలకాలకెక్కినా.. పనులకు మాత్రం పునాది పడలేదు. పనులు ఈసారి ప్రారంభిస్తారని అనుకున్నా.. ఏటికేడు జాప్యం జరుగుతూనే ఉంది. ఫలితంగా నదిలో ప్రయాణం పాణసంకటంగా మారింది.

కేవలం 650మీటర్లు పొడవైన వారధి నిర్మిస్తే వేలాది ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. 1960నుంచి వంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూనే ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు శిలాఫలకాలూ వేశారు. 1984లో ఎన్టీ రామారావు, 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2013లో కిరణ్‌కుమార్ రెడ్డి....... శంకుస్థాపన చేశారు. 67న్నర కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించినా... సాంకేతిక కారణాలతో పనులు మొదలవలేదు.

రోజూ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, రోగులు, ఇలా అనేక మంది...... పంటులపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లనూ...... వాటిలోనే దాటిస్తున్నారు. పంటుల నిర్వహణకు టిక్కెట్ల ద్వారా డబ్బూ వసూలు చేస్తున్నారు. పంటు ప్రయాణాన్ని నమ్ముకుంటే.... సమయపాలన గాల్లో

కలుస్తోందని రోజువారీ ప్రయాణికులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో వశిష్ఠ వంతెన నిర్మాణానికి హామీలిస్తున్న నేతలు.......... ఈసారి ఎన్నికల్లోపైనా నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి రిజర్వేషన్​పై విచారణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.