పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మూడో పట్టణ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రెండో పట్టణ పరిధికి చెందిన ముగ్గురు యువకులు బస్‌స్టాండ్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ దాటేందుకు యత్నించారు. వేగంగా వస్తున్న రైలును అంచనా వేయలేక ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే.. వారిని రైలు ఢీ కొట్టింది. రైలు వేగాన్ని అంచనా వేయకుండా ట్రాక్ దాటుతున్న ఇద్దరిని రైలు ఢీకొట్టింది. ఒకరు ట్రాక్‌పై నుంచి పక్కన దూకేశారు.
రైలు ఢీకొన్న ఇద్దరి శరీరాలు ఛిద్రమయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ ఆది ప్రసాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ యువకుడి ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మృతులు తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన గంటా సిద్దు (23), కొత్తపేటకు చెందిన యాండ్రపు భరత్(25) గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన యువకుడు తంబారి పవన్ కళ్యాణ్ (24) ఆర్ఆర్ పేట చింతచెట్టు ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.
ఇదీ చదవండి: