చేపల వేటకెళ్లి ఓ బాలుడు, మరో యువకుడు మృతి చెందారు. ఈ విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా గవరవరంలో జరిగింది.
గ్రామానికి చెందిన కరుటూరి మంగరాజు (21), అక్కల అభి (7) ఇద్దరూ కలిసి మధ్యాహ్న సమయంలో చేపలు పట్టేందుకు చెరువులో దిగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. లోతు ఎక్కువగా ఉండడంతో మృత్యువాత పడ్డారు. స్థానికుల మృతదేహాలను వెలికి తీశారు. వారి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: విత్తన దుకాణాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు