ETV Bharat / state

దెందులూరులో ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

author img

By

Published : Mar 24, 2021, 1:48 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.

family committed suicide
దెందులూరులో ముగ్గురు ఆత్మహత్యాయత్నం.. ఇద్దరు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరంలో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించారు. దెందులూరు ఎస్‌ఐ రామ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తొర్లపాడు గ్రామానికి చెందిన పావులూరు వెంకటనారాయణ(70), అతని భార్య కృష్ణ తులసి, కుమారుడు భాను వికాస్‌(33) గుంటూరు రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వీరు సింగవరం పొలాల వద్ద అపస్మారకస్థితిలో పడి ఉండటం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సమయానికే భానువికాస్‌ మృతిచెందాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటనారాయణ, కృష్ణతులసిని ఏలూరు ప్రభుత్వాసుత్రికి తరలిస్తుండగా వెంకటనారాయణ మృతిచెందాడు. ప్రస్తుతం కృష్ణతులసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ముగ్గురు గుంటూరు నుంచి దెందులూరు మండలానికి వచ్చి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్యకు యత్నించి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుల బంధువులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ రామ్‌కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండీ.. పి.కొత్తపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.