ETV Bharat / state

స్పిరిట్ తాగిన​ ఘటనలో 3కు చేరిన మృతుల సంఖ్య

మందు దొరకకగా ఆరుగురు వ్యక్తులు శీతలపానీయంలో డైల్యూటెడ్​ స్పిరిట్​ కలుపుకుని తాగిన ఘటన కావలిపురంలో చోటు చేసుకుంది. వీరిలో అతిగా సేవించిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మిగతా వారు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స ద్వారా కోలుకున్నారు.

three people died of drinking spirit
స్పిరిట్​ తాగి ముగ్గురు మృతి
author img

By

Published : Apr 2, 2020, 2:21 PM IST

స్పిరిట్​ తాగి ముగ్గురు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా కావలిపురంలో మందు దొరక్క.. కొందరు యువకులు స్పిరిట్​ తాగిన ఘటనలో.. మృతుల సంఖ్య మూడుకు చేరింది. మిగిలిన ముగ్గురు తక్కువగా తాగిన కారణంగా ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారు.

తణుకు మండలానికి చెందిన ధర్నాల నవీన్​ మూర్తిరాజు, అల్లాడి వెంకటేష్​, పండూరి వీరేష్​, తణుకు దుర్గారావు, కె. వెంకటదుర్గాప్రసాద్​, విప్పర్తి శ్యాంసుందరం స్నేహితులు. వీరిలో వీరేష్​.. తణుకులోని కెమికల్స్​ దుకాణంలో పనిచేస్తుండేవాడు. మందు దొరకడం లేదని యజమానికి తెలియకుండా దుకాణం నుంచి డైల్యూటెడ్​ స్పిరిట్​ను తీసుకువచ్చాడు. ఆరుగురు కలిసి శీతలపానీయంలో కలుపుకొని తాగారు. వీరిలో తొలిగా నవీన్​ అస్వస్థతకు గురైయ్యాడు. ఇతన్ని తణుకు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

వేల్పూరునకు చెందిన అల్లాడి వెంకటేష్​, కావలిపురానికి చెందిన పండూరి వీరేష్​కూ అదే పరిస్థితి ఎదురైంది. మార్గమధ్యంలో వెంకటేష్​ చనిపోయాడు. వీరేష్​కు చికిత్స అందిస్తున్నా.. స్పందన లేకపోవడం వల్ల వైద్యులు అతన్ని ఇంటికి పంపించేశారు. అతనూ మార్గమధ్యంలో మరణించాడు. ఘటనపై ఎక్సైజ్​ పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మందు దొరకక స్పిరిట్ తాగి యువకుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.