Attack on Mahasena chief Rajesh: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మహాసేన అధినేత రాజేష్‌పై కొంతమంది అల్లరి మూకలు దాడి చేశాయి. ఆదివారం రాత్రి జనసేన నగర నాయకుడు వై.శ్రీను పుట్టిన రోజు వేడుకలకు రాజేష్ హాజరయ్యారు. అనంతరం తన కారులో బయలుదేరిన రాజేష్‌పై.. అప్పటికే నందం గనిరాజు జంక్షన్‌లో మాటు వేసిన కొంతమంది యువకులు కారు అద్దాలను పగలగొట్టి నానా రచ్చ చేశారు.
పోలీసుల సమక్షంలోనే దుర్భాషలాడుతూ కారుపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. జనసైనికులు కూడా తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో నందం గనిరాజు జంక్షన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు అల్లరి మూకల దాడి నుంచి రాజేష్‌ను అతికష్టంపై పంపించేశారు. ఇది వైకాపా నాయకుల పనేనని జనసేన నాయకులు ఆరోపించారు. ఘర్షణ వాతావరణం తొలగిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకుని పహారా కాశారు. ''జనసేనకు మద్దతిచ్చినప్పుడే ప్రాణాలకు తెగించా. నన్ను చంపిన తర్వాతైనా నా జాతి ఈ వైకాపా అక్రమాలను అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజే ప్రాణాలకు తెగించా. ప్రాణాలను తీసినా మాలోని ధైర్యాన్ని చంపలేరు'' అని మహాసేన రాజేష్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి