ఇంట్లో చోరీ.. వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీం - జంగారెడ్డిగూడెంలో చోరీ
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన చోరీ కేసులో.. క్లూస్ టీమ్.. దర్యాప్తు ముమ్మరం చేసింది. బాధితుని ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ఇంటి ప్రధాన ద్వారం, బీరువా వద్ద దొంగల వేలిముద్రలు సేకరించారు. దొంగలను త్వరలోనే పట్టుకుని.. పోయిన నగదును రికవరీ చేస్తామని డీఎస్పీ స్నేహిత తెలిపారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే వ్యక్తులు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకూడదని సూచించారు.