పోలవరం ప్రాజెక్ట్ మేఘా ఇంజినీరింగ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ నాయక్ అభినందించారు. రూ.52 లక్షలు దొంగతనం చేసిన సెక్యురిటీ గార్డును 12 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చోరీ జరిగిన వెంటనే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితున్ని పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉన్నట్లు పక్కా సమాచారంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడం ద్వారా సులువుగా కేసును ఛేదించినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..