పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు గునపాలతో ఆలయంలోని హుండీని పగలగొట్టి.. నగదును అపహరించారు. స్వామి, అమ్మవార్ల వెండి ఆభరణాలను సైతం దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలను సేకరించారు.
ఇదీ చదవండి: పిల్లలపై కొవిడ్ పిడుగు.. 45 రోజుల్లోనే 5 వేల మందికి వైరస్