పోడు భూములకు పట్టాలివ్వాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని మన్యం మండలాల్లో ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటోన్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టాల పేరుతో ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్ప నేటికీ అర్హులను గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు.
ఇదీ చదవండి:ఉగాది తరువాతే ఇళ్ల విజ్ఞప్తులపై స్పష్టత: రామాచార్యులు