తెలుగు సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా 29 ఏళ్లుగా కథా ప్రస్థానం కొనసాగుతోంది. ఈసారి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైఎన్.కళాశాలలో కథ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ప్రముఖ సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు... "కథ-2018” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు వంశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయతల ముఖాముఖి నిర్వహించారు. పుస్తకంలోని కథలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
కవిత్వం, పద్య కవిత్వం, సాహిత్యం కంటే... కథ సామాన్యులకు బాగా దగ్గరవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీకారం చుట్టిన కథా సంకలనం... ప్రజల్లోకి బలంగా వెళ్లడమే కాకుండా, భాషాభివృద్ధికి పునాది వేస్తుందని సాహితీవేత్తలు అంటున్నారు. "కథా సంకలనం" కలకాలం ఇలాగే కొనసాగాలని, తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తుండాలని ఆకాంక్షించారు.