ETV Bharat / state

ఏపీ ప్రభుత్వమే ఆదుకోవాలి: కరోనా బాధితుడు - telugu corona patient discharge in chennai

రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు చెన్నైలో కరోనాతో బాధపడుతున్నాడు. కరోనా పాజిటివ్ అని తెలిసినా తనకు ఎటువంటి చికిత్స చేయకుండా, డిశ్చార్జ్ చేసి తన గదికి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు.

corona patient discharge in chennai
కరోనా ఉన్నా ఆసుపత్రి డిశ్చార్జ్ చేశారు
author img

By

Published : May 13, 2020, 1:43 PM IST

కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా, తనను చైన్నై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారంటూ పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను చెన్నైలోని కోయంబేడు మార్కెట్​లో పని చేస్తున్నాననీ, కరోనా లక్షణాలతో ఈ నెల 5వ తేదీన చెన్నై జీహెచ్​ ఆసుపత్రిలో చేరినట్లు యువకుడు వివరించాడు. 8న కరోనా పాజిటివ్​గా నిర్థరణ అయ్యాక 2 రోజులు చికిత్స చేసి 10వ తేదీన డిశ్చార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

కరోనా ఉన్నా... ఆసుపత్రి నుంచి పంపించేశారు

దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాననీ, తినటానికి ఇంట్లో పండ్లు తప్ప ఏమీ లేవని వాపోయాడు. ఆన్​లైన్​లో ఆహారాన్ని తెప్పించుకునేందుకు ఆస్కారం లేదని వివరించాడు. తాను బయట తిరిగితే తన ద్వారా మరికొంత మందికి కరోనా సోకే ప్రమాదం ఉందనీ, తనకు చికిత్స అందించాలని వేడుకుంటున్నాడు. తనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు.

ఇదీ చదవండి: 'ఇలా ఎంతసేపు నిరీక్షించాలి.. త్వరగా పంపండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.