పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రగుంటపల్లి గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు బొలెరో వాహనంలో తరలిస్తున్న 4 లక్షల విలువ చేసే 306 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తుని మండలం సురవరం గ్రామానికి చెందిన ప్రగడ వెంకట్రావు అనే వ్యక్తి వీటిని కొంత మంది వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి తూర్పుగోదావరి జిల్లాలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఒకరికి పాజిటివ్
అక్రమ మద్యమం సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేయటంతో పాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావటంతో... మిగిలిన ఇద్దరిని క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చూడండి