పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో లైంగిక వేధింపులపై.. ఓ ఉపాధ్యాయురాలు కలెక్టర్ ను ఆశ్రయించారు. సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరత్నం.. 2 నెలలుగా వేధిస్తున్నాడంటూ ఈ నెల 15న విద్యా శాఖ అధికారులను ఆమె ఆశ్రయించారు. వారి నుంచి స్పందన లేని పరిస్థితుల్లో కలెక్టర్ ముత్యాలరాజు దృష్టికి సమస్య తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు.. విద్యాశాఖ ఏడీ సూర్యకుమారి.. బాధిత ఉపాధ్యాయురాలితో పాటు, సిబ్బందితోనూ మాట్లాడారు. వివరాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు.
ఇవీ చూడండి: