ETV Bharat / state

' సీఎం జగన్​కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు' - నరసాపురంలో తెదేపా నాయుకుల కాగడాల నిరసన తాజా వార్తలు

తెదేపా నాయకుల అరెస్టులను నిరసిస్తూ నరసాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కాగడాల నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో ఎఫ్​ఐఆర్​ కాపీలను తగలబెట్టారు. వెంటనే అచ్చెన్నాయుడు, ప్రభాకర్​ రెడ్డిలను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

tdp leaders protest against arrests of acchennaidu and prabhakar reddy in narasapuram
ఎఫ్​ఐఆర్​ కాపిలను తగలపెట్టి తమ నిరసన చెబుతున్న తెదేపా నాయకులు
author img

By

Published : Jun 15, 2020, 10:04 AM IST

తెదేపా ఎమ్మెల్యే అచ్చెనాయుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్​ రెడ్డిల అరెస్టులను ఖండిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కాగడాల నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఫ్​ఐఆర్​ కాపీలను తగలపెట్టి తమ నిరసనను వెల్లడించారు. రాష్ట్రంలో అనేకే కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి తమ నాయకులపై అక్రమ కేసులు బనాయించి ముద్దాయిలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని.. త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు.

tdp leaders protest against arrests of acchennaidu and prabhakar reddy in narasapuram
ఎఫ్​ఐఆర్​ కాపిలను తగలపెట్టి తమ నిరసన చెబుతున్న తెదేపా నాయకులు

ఇదీ చదవండి :
తెదేపా నేతల అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.