Lokesh On Child Deaths: పశ్చిమగోదావరి జిల్లా బోడిగూడెంలో అంతుచిక్కని జ్వరాలతో నలుగురు చిన్నారులు మృత్యువాతపడడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయి, యాభై మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవటం లేదని మండిపడ్డారు.
కొన్ని వారాలుగా పదిహేనేళ్ల లోపు చిన్నారులు వేర్వేరు లక్షణాలు, జ్వరాలతో బాధపడుతుంటే.. వైద్యారోగ్యశాఖ అధికారులు పట్టించుకునే స్థితిలో లేకపోవటం దారుణమన్నారు. రాష్ట్రంలోని పిల్లలందరికీ తాను మేనమామనంటూ ప్రకటించుకున్న ముఖ్యమంత్రి జగన్.. వారు ప్రమాదంలో ఉంటే పట్టించుకోరా? అని నిలదీశారు. పిల్లల బాగుకోరేవారు మేనమామ అవుతారు తప్ప, చావుకోరే వారు కాదన్నారు.
చిన్నారుల మరణాలన్నీ.. జగన్ సర్కారు చేసిన నిర్లక్ష్యపు హత్యలే అన్న లోకేష్.. పరిస్థితి విషమించకముందే వైద్య బృందాలను పంపి అంతుచిక్కని జ్వరానికి కారణాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న 50 మందికిపైగా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించి, ప్రాణాపాయం లేకుండా చూడాలని కోరారు.
ఇదీ చదవండి
YEAR OF ELUSIVE DISEASE IN ELURU : ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి ఏడాది