తమిళనాడులో పట్టుపడిన కోట్లాది రూపాయల నగదుకు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధం ఉందని తెదేపా నేత గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల అక్రమ సొమ్ముతో సంబంధం ఉన్న మంత్రిని తక్షణమే పదవి నుంచి తొలగించి... ప్రభుత్వం నిజాయతీ నిరూపించుకోవాలని హితవు పలికారు. డబ్బుతో పట్టుబడిన వ్యక్తులు మంత్రి పేరు చెప్పినా.. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగిన క్వారీ