ఏడాదిన్నర కాలంలో ప్రజలపై ఎన్నో రకాల పన్నుల భారం వేయటంలో సీఎం జగన్ గిన్నిస్ రికార్డు సాధించారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. రానున్న రోజుల్లో సొంత కరెన్సీ తయారీకి జగన్ సిద్ధపడతారని ఎద్దేవా చేశారు. పాలనలో తుగ్లక్, పనుల్లో ఐబక్ను అధిగమించేందుకు జగన్ సొంత చరిత్ర తయారు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీకి అభినందనలు.. చరిత్రలో అదో మైలురాయి: చంద్రబాబు