ETV Bharat / state

మాజీ కౌన్సిలర్​ కుటుంబానికి తెదేపా ఆర్థిక సాయం - tanuku ex mla arimilli radhakrishna latest news

ఇటీవలే మృతి చెందిన తణుకు మాజీ కౌన్సిలర్​ పిల్లా రాంబాబు కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ లక్ష రూపాయల నగదును అందజేశారు. నిబద్ధత కలిగిన నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

tdp gioven financial support to the party leaders
మాజీ కౌన్సిలర్​ పిల్లా రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన అరిమిల్లి రాధాకృష్ణ
author img

By

Published : Oct 3, 2020, 4:28 PM IST

ఇటీవల కొవిడ్​కు గురై మృతి చెందిన తణుకు మాజీ కౌన్సిలర్​ పిల్లా రాంబాబు కుటుంబ సభ్యులను... మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. పార్టీ బలోపేతానికి రాంబాబు తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. వీరనారాయణ థియేటర్​ వద్ద తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానకి విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.

పార్టీ నాయకుల తరఫున రూ. లక్ష చెక్కును... రాంబాబు భార్యా పిల్లలకు అందజేశారు. నిబద్ధత కలిగిన నాయకులకు కార్యకర్తలకు తెదేపా ఎల్లప్పడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాంబాబు కుటుంబానికి భవిష్యత్తులోనూ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

గీతం వ్యవస్థాపకుడు మూర్తి వర్థంతి-తెదేపా నేతల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.