REVENUE ADMINISTRATION: పశ్చిమగోదావరి జిల్లా తణుకు రెవెన్యూ కార్యాలయ భవనాన్ని 1887వ సంవత్సరంలో నిర్మించారు. అంటే స్వాంతంత్రం సిద్ధించకముందు.. బ్రిటీష్ వాళ్లు దీన్ని నిర్మించారు. గోస్తని కాలువ పక్కనే ఉండడంతో.. ఈ కార్యాలయం అప్పట్లో జల రవాణాకు బాగా ఉపయోగపడేది. అంతచరిత్ర ఉన్న ఈ ఆఫీస్‌లో ఎంతో మంది అధికారులు పనిచేశారు. ఎన్నో సేవలు అందించారు.
నాటి చరిత్ర గురించి.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా.. పదిమందికీ తెలిపే ప్రయత్నం చేశారు ప్రస్తుత తహసీల్దార్ ప్రసాద్. పాత దస్త్రాల మధ్య నలిగిపోతున్న ఈ కార్యాలయ చరిత్రను.. ఛాయాచిత్రాల రూపంలో బయటకుతెచ్చారు. నామరూపాల్లేకుండా ఉన్న ఫొటోలకు కొత్త రూపు ఇచ్చారు.
1887లో ఇక్కడ పనిచేసిన మొదటి తహసీల్దార్.. ఆ నాటి మునసబులు, కరణాల గ్రూఫ్ ఫొటోలు, బ్రిటిష్ ప్రభువులు గిరిజన బాలికలతో తీయించుకున్న ఫోటోలు, బ్రిటిష్ అధికారులు పడవలపై వచ్చినప్పుడు స్థానిక అధికారులు స్వాగతం పలికిన ఫొటోలు వెలికితీయించి.. వాటిని ప్రదర్శనకు పెట్టారు. 1890లో వరదల సమయంలో ప్రజలకు ఏర్పాటు చేసిన.. పునరావాస కేంద్రాలు, 1899నాటి కరవు సమయంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం పంపిణీ చేసిన ఫొటోలు ఇందులో ఆసక్తికరంగా ఉన్నాయి. మరుగునపడిపోయిన ఇలాంటి అరుదైన ఫొటోలు ప్రాచుర్యంలోకి వచ్చాయంటూ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: