వైకాపా గుర్తుపై ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ పార్టీని, నాయకులను విమర్శించటం దారుణమని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రిని వ్యగ్యంగా, అసభ్యపదజాలంతో విమర్శించటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఉన్న ప్రతిష్ఠకు భంగం కలిగించేలా రఘురామ వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
రఘురామరామను కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.., ప్రభుత్వం చట్టప్రకారమే చర్యలు చేపట్టిందన్నారు. అనవసరంగా నోటికి పని చెప్పటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని..,ఇకనైనా ఓ ఎంపీగా సజావుగా వ్యవహరించాలని హితవు పలికారు.