జులై చివరి వరకు తణుకు పట్టణంతోపాటు మండల కేంద్రాలైన ఇరగవరం, అత్తిలిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. కరోనా విజృంభిస్తున్నందున పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన వివరించారు. లాక్‌డౌన్ అమలులో ఉన్న ప్రాంతాలలో నిత్యావసర దుకాణాలు ఉదయం ఆరు గంటలనుంచి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటాయని, ఔషధ దుకాణాలు మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. మిగిలిన అన్ని వ్యాపారాలు మూసేయాలని స్పష్టం చేశారు. అవసరం లేనిదే బయటకు రావద్దని, ప్రజలందరూ గతంలో మాదిరిగా లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.
కరోనాను అరికడదాం.. లాక్ డౌన్‌కు సహకరించండి: ఎమ్మెల్యే కారుమూరి - అత్తిలి లాక్ డౌన్ వార్తలు
కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న వేళ తణుకు పట్టణంతోపాటు మండల కేంద్రాలైన ఇరగవరం, అత్తిలిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
![కరోనాను అరికడదాం.. లాక్ డౌన్‌కు సహకరించండి: ఎమ్మెల్యే కారుమూరి mla karumoori nageshwar rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8167661-606-8167661-1595683320187.jpg?imwidth=3840)