కరోనా నివారణ చర్యల్లో భాగంగా వివిధ స్వచ్ఛంద, వ్యాపార, సేవా సంస్థలు తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో వివిధ వ్యాపార సంస్థలు రూ.8 లక్షలు విరాళాలు సేకరించారు. వీటిని స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు అందజేశారు. కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు స్పందించి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న సంస్థల ప్రతినిధులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:ఆచంటలోని నిరాశ్రయులకు నిత్యావసరాలు పంపిణీ