ETV Bharat / state

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పి.. ఔరా అనిపించారు

VEMANA PADHYA DHAARANA: తెలుగు భాషను కాపాడటానికి, దాని ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి విద్యార్థులు సిద్ధమయ్యారు. వివిధ పాఠశాలల విద్యార్థులు వేమన పద్య ధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకేసారి 1008 మంది విద్యార్థులు 1008 పద్యాలను ఆలపించి ఔరా అనిపించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్​లో నమోదు చేశారు.

vemana padhyalu
వేమన పద్యాలు ఆలపిస్తున్న విద్యార్థులు
author img

By

Published : Dec 10, 2022, 6:42 PM IST

VEMANA PADHYA DHAARANA: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాతృభాషా సేవా సమితి ఆధ్వర్యంలో వేమన పద్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1008 మంది విద్యార్థులు 1008 వేమన పద్యాలను ఆలపించే కార్యక్రమాన్ని చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వేర్వేరు సమయాల్లో వేమన పద్యాలను ఆలపించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు వివిధ ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి, వేమన పద్యాల సారాన్ని విద్యార్థులు తెలుసుకునేలా చేయడానికి పద్య ధారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన విద్యార్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.