పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను గ్రామానికి చెందిన షేక్ ఉమర్ ఫరూక్... ఐఐటీజీ ప్రవేశ పరీక్షలో 4,720వ ర్యాంక్ సాధించాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి 10 శాతం రిజర్వేషన్ ఉండటంతో.. సంబంధిత ధ్రువపత్రం (ఈడబ్ల్యూఎస్) కోసం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో... ఇప్పటికే బీసీ వర్గీయులుగా రిజర్వేషన్ పొందుతున్నందున ఈడబ్ల్యూఎస్ పత్రాలు ఇవ్వలేమని తహసీల్దార్ నిరాకరించారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థి, అతని తండ్రి... ఆర్డీఓ, సంయుక్త కలెక్టర్, మైనారిటీ శాఖ అధికారులను కలిశారు. అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ... ధ్రువపత్రం మంజూరు కాకపోవటంతో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించి... ధ్రువపత్రం మంజూరుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టకేలకు తనకు ధ్రువపత్రం అందడంపై బాధిత విద్యార్థి ఆనందం వ్యక్తం చేశాడు.
ఇదీచదవండి.