పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆస్పత్రిని... జిల్లా కేంద్ర ఆస్పత్రిగా మార్చేందుకు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్గ్రేడ్ పనులకు శంకుస్థాపన చేశారు. వైద్యఆరోగ్య శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతని ఇస్తుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వైద్యఆరోగ్య శాఖకు రూ.16 వేల కోట్లు కేటాయిచామని అన్నారు.
లాక్‌డౌన్ నిబంధనలు సడలించడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని నాని అభిప్రాయపడ్డారు. ప్రధాని సూచనల మేరకు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 11,502 కేసులు.. 325 మరణాలు