ఫిర్యాదులు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినవారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూస్తామని పశ్చిమగోదావరిజిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ అన్నారు. పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాల తనిఖీల్లో భాగంగా భీమవరంలో పర్యటించారు. పోలీస్‌స్టేషన్‌లో అన్ని సదుపాయాలు ఉండాలని అధికారులకు సూచించారు. పేకాట, కోడి పందాలు, గ్యాంబ్లింగ్ ఎవరైనా ఆడితే వారిపై కఠిన చర్యలు చేపడతామని వివరించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ మంచి పరిణామం అని... దీనిపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎవరైనా రౌడీషీటర్లు ఉంటే వారికి ప్రతి వారం కౌన్సెలింగ్ ఇస్తామని, రౌడీయిజం లేకుండా అణచివేస్తామని నవదీప్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి.