పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకపవరంలో దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లిని కొడుకే అతి దారుణంగా నరికి చంపాడు. చినకపవరంలో సత్తినీటి సత్యవతికి ఆరుగురు సంతానం. రెండో కుమారుడు బంగారయ్య ఇవాళ తెల్లవారుజామున తన తల్లిని దారుణంగా హింసించి.. పారతో నరికి తలను వేరు చేశాడు. ఈ దారుణ హత్య చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భూవివాదాలే హత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండి