పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం రామారావుగూడెం సచివాలయంలో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. ఆధార్ కార్డుల్లో మార్పుల వ్యవహారంపై విచారణ నిర్వహించారు. వైఎస్సార్ చేయూత పథకానికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారే అర్హులు. అయితే కొంతమంది ఆధార్లో వయసును మార్చుకోవడం ద్వారా లబ్ధి పొందడానికి చర్యలు చేపట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లటంతో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. ఏలూరులోని ఒకచోట విచారణ చేయగా రామారావు గూడెం గ్రామానికి చెందిన కొందరు ఆధార్ కార్డుల్లో మార్పులు చేయించుకున్నట్లు తేలింది.
ఈ క్రమంలో విజిలెన్స్ సీఐ నాగేశ్వరరావు, ఎఫ్ఆర్వో సీతారామ వరప్రసాద్ సిబ్బందితో రామారావుగుడెం గ్రామ సచివాలయంలో బుధవారం విచారణ నిర్వహించారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులను కార్యాలయానికి పిలిపించి ఆధార్, పాన్ కార్డులు తనిఖీ చేశారు. కొందరు వయసు పెంచుకోవడానికి చర్యలు చేపట్టిన మాట వాస్తవమేనని అంగీకరించారు. విచారణ నివేదికను పై అధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి