పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 16వ నెంబరు జాతీయ రహదారిపై ఉండ్రాజవరం జంక్షన్ వద్ద నాలుగు వైపులా సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో సిగ్నల్ లైట్లు మరమ్మతులకు గురయ్యాయి. తాజాగా పట్నం వైపు వెళ్లేవారికి సిగ్నల్ ఇచ్చే లైట్ల స్తంభాన్ని వాహనం ఢీకొట్టడంతో పక్కకు ఒరిగిపోయింది. నాలుగు వైపులా సిగ్నల్ లైట్లు పని చేయకపోవటంతో జాతీయ రహదారిపై వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఒక్కొక్కసారి వాహన చోదకుల వేగానికి తాము ఎక్కడ ప్రమాదానికి గురవుతామోనని భయపడుతున్నారు.
నిత్యం వేలాది వాహనాలు తిరిగే కూడలి ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు వెలగక పోవటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు లైట్లు మరమ్మతులు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి