పశ్చిమగోదావరిజిల్లా తణుకు నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా దుకాణాల సమయాన్ని కుదిస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 29 నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు. ప్రజలందరూ సహకరించి కరోనా నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. అధికారులు, ప్రజల సహకారంతో మొదటిదశలో కేసులు నమోదు కాకుండా నివారించామన్నారు. ఆంక్షల సడలింపుతో ప్రజలు రోడ్ల మీదకు వస్తుండటంతో కేసులు పెరిగాయన్నారు.
కరోనా తీవ్రతతో దుకాణాల సమయం కుదింపు - కరోనా కేసులు పెరుగుతన్నందున తణుకు ఎమ్మెల్యే చర్యలు
కరోనా కేసులు పెరుగుతున్నందున వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నారు. దుకాణాల సమయాన్ని కుదిస్తున్నట్టు ప్రకటించారు.