పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం తనిఖీ కేంద్రం వద్ద గురువారం అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ అశ్వరావుపేట నుంచి తాడేపల్లిగూడేనికి తరలిస్తున్న 14 మద్యం సీసాలు, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ కానిస్టేబుల్ పోతురాజు తెలిపారు. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని మద్యంతో పాటు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించామని చెప్పారు. అక్రమ రవాణాపై ఎస్సై విశ్వనాథ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఆటో: ముగ్గురికి గాయాలు