School bus accident: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో స్కూల్ బస్సు.. రోడ్డు పక్కన ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. బస్సు స్టీరింగ్ పట్టేయడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 27మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే.. స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. కొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివచ్చారు. ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
నెల్లూరులో సద్దుమణిగిన వివాదం.. తామంతా జగన్ వర్గమేనన్న నేతలు