Sankranti Celebrations: సంక్రాంతి సంబరాల సందడి మొదలైంది. భోగిమంటలకు పల్లెలు, పట్నాలన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే వీధుల్లో రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. పిండివంటల ఘుమఘుమలతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి కోడిపందెం బరులు సిద్ధమవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఊపందుకున్నాయి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా పెద్దపండుగకు ఇళ్లకు చేరుతున్నారు. పల్లెల్లో వీధులన్నీ రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దుతున్నారు. విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, కార్యాలయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి మంటలు వేసి, గంగిరెద్దులతో ఊరేగించారు. బాపట్ల కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
పాఠశాలలు, కళాశాల్లో ఒకరోజు ముందుగానే సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కళాశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేశారు. భోగి మంట వేసి చుట్టూ చేరి పాటలు పాడారు.
ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం వెనకడుగు - అమలు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో జగన్
తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండుగ సంక్రాంతి. పండి వంటలు. కొత్తబట్టలుతో నెల్లూరు జిల్లాలోని పట్టణాలు పల్లెలు కళకళలాడుతున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కొత్త బట్టలు దరించారు. జిల్లాలోని కందుకూరు, కావలి, నెల్లూరు పట్టణాల్లో వస్త్ర దుకాణాలు వినియోగదారులతో సందడిగా మారాయి. పండుగ ముందు రోజుకూడా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కొత్తవస్త్రాలు కొనుగోలు చేశారు.
రాజమహేంద్రవరంలో పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. లలితానగర్ లో ట్రస్ట్ ఛైర్మన్, ట్రిబుల్ సీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను సంబరంగా నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతలు సంప్రదాయ వస్త్రధారణలో అలరించారు. రంగవల్లుల చక్కగా తీర్చిదిద్దిన యువతులకు బహుమతులు అందించారు.
అంబరాన్నంటిన సంక్రాంతి సంబారాలు - నృత్యాలతో సందడి చేసిన మహిళలు
సంక్రాంతి పురస్కరించుకుని కోడిపందెలకు బరులు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారపార్టీ నేతల కనుసన్నల్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటు చేశారు. గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో వైకాపా రంగులతోనే బరులు సిద్ధం చేసినా, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో పెద్దఎత్తున కోడిపందెల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కంచికచర్ల మండలం గండేపల్లిలో పొట్టేళ్ల పందేలు ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా పర్చూరులో దక్షిణ భారత్‌స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు కర్ణాటక, ఝార్ఖండ్, గోవా జట్లు పాల్గొన్నాయి. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలోని పలు గ్రామాల్లో మైలేరు పండుగ నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేశారు.
మునిగిపోతున్న వైసీపీ నుంచి బయటపడేందుకు పార్టీని వీడుతున్నారు: గంటా శ్రీనివాసరావు