ETV Bharat / state

ఆన్‌లైన్‌లో విక్రయాలు నిలిపివేత... రీచ్‌లకు వెళ్లి ఇసుక కొనాల్సిందే! - sand reaches in west godavari news

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక సరఫరా చేసే విధానానికి ముగింపు పలికారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇసుక విక్రయాలు ఇకపై జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ సారథ్యంలో సాగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఇసుక, సీసీ కెమెరాలను ఆ సంస్థకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయాలు నిలిపివేశారు. సరఫరాను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించినా ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగనుంది.

sand transport
చిడిపి రేవులో ఇసుక రవాణా
author img

By

Published : May 20, 2021, 8:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, చేబ్రోలు ఇసుక డిపోల్లో 1.7 లక్షల టన్నులు నిల్వ ఉంది. దీన్ని తాజాగా జిల్లా అధికారులు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీనికి వారు ప్రభుత్వానికి నిర్దేశిత మొత్తం చెల్లించాల్సి ఉంది.

జిల్లాలో మొత్తం 22 ఓపెన్‌, 27 డీసిల్టేషన్‌ రీచ్‌లు, మూడు డిపోలు ఉన్నాయి. ఇందులో మొదట కొవ్వూరు పరిధిలోని చిడిపి, పెరవలి మండలం కానూరు-పెండ్యాల పరిధిలోని ఓపెన్‌ రీచ్‌లు మొదలు కాగా.. మరో నాలుగు అందుబాటులోకి రానున్నాయి. టన్ను ఇసుక రూ.475 విక్రయించాలని ధర నిర్ణయించారు. వినియోగదారులు రీచ్‌లకు వెళ్లి వారికి నచ్చిన ఇసుకను కొనుగోలు చేయవచ్ఛు అక్కడ ఉండే కాంట్రాక్ట్‌ వాహనాల ద్వారా కూడా రవాణా చేసుకోవచ్ఛు అందుకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు కిలోమీటరుకు రూ.4.90 ఛార్జీలు వసూలు చేయాలి.

  • 21 నాటికి పూర్తి స్థాయిలో..

పరిమిత రీచ్‌లు అందుబాటులో ఉండటం, డీసిల్టేషన్‌ రీచ్‌లు, డిపోలు అందుబాటులో లేక పోవడంతో వినియోగదారులకు ఇసుక ఇక్కట్లు తప్పడం లేదు. దీనిపై అధికారులు, జేపీ పవర్‌ వెంచర్స్‌ సిబ్బంది దృష్టి పెట్టారు. జిల్లాలో లెక్క ప్రకారం 22 ఓపెన్‌ రీచ్‌లు ఉన్నా పూర్తిస్థాయిలో అవన్నీ గతం నుంచీ అందుబాటులోకి రావడం లేదు. 10, 12 రీచ్‌లు మినహా మిగిలినవి ఇసుక సరఫరాకు సిద్ధం కావడం లేదు. ఇందుకు స్థానికంగా ప్రజలు దారులు ఇవ్వడానికి విముఖత చూపడం వంటి కారణాలున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న 27 డీసిలిటేషన్‌ రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేసేందుకు పడవల నిర్వాహకులతో కార్మికుల వేతనాలు ఇతర విషయాలపై ప్రైవేటు సంస్థ ప్రతినిధులు చర్చిస్తున్నారు. 21వ తేదీ నుంచి పూర్తిస్థాయిలోకి జిల్లావ్యాప్తంగా ఇసుక సరఫరా చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

యథాతథంగా

గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నా అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. రేవుల నుంచి ఎంత ఇసుక తెస్తున్నారు. వినియోగదారులకు ఎంత విక్రయిస్తున్నారు. బిల్లులు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే అంశాలపై ఎస్‌ఈబీ అధికారులు పర్యవేక్షిస్తారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై విచారణ చేస్తారు. నిర్దేశిత ధరకే విక్రయాలు జరిగేలా చూస్తారు. - వెంకటరమణారెడ్డి, జేసీ, రెవెన్యూ

  • 950 మందికి నగదు వాపసు

గతంలో 950 మందికి 13 వేల టన్నుల వరకు ఇసుక సరఫరా చేయాల్సి ఉండగా వారి బుకింగ్‌ రద్దు చేశారు. దీంతో ఆయా వినియోగదారులకు వారి ఖాతాల్లో నగదు జమ చేస్తారు. వీరు ప్రస్తుత విధానం ప్రకారం రీచ్‌లకు వెళ్లి ఇసుక కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఇసుక అక్రమ రవాణా.. 11 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.