పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరంలో ఉన్న ఉప్పు మడులు బుధవారం కురిసిన వర్షానికి నీటమునిగాయి. అకాల వర్షంతో మడుల వద్ద తీసిన ఉప్పు గుట్టలు కరిగిపోయి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
వర్షం ప్రభావంతో ఉప్పు మడుల్లో నీరు నిలిచిపోయి పంట పాడయింది. మెరక ప్రాంతానికి తరలించి గుట్టలు పోసి భద్రపరచుకునే సమయంలో అకాల వర్షం కారణంగా ఉప్పు రైతులు నష్టపోయారు. జిల్లా తీర ప్రాంతంలోని నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్లు పరిధిలో గ్రామాల్లో పూర్వం నుంచి ఉప్పు సాగు చేస్తున్నారు. ఉప్పును పంటగా గుర్తించకపోవడం, విపత్తులతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో వేలాది ఎకరాల్లో ఉన్న ఉప్పు సాగు వందల ఎకరాలకు తగ్గిపోయింది.
మొన్నటి వరకు పండిన పంటకు సరైన ధర లేక ఇబ్బంది పడ్డ రైతుకు అకాల వర్షం మరోసారి నష్టాన్ని మిగిల్చింది.
ఇదీ చదవండి: మర్మాంగాన్ని కోసి భర్తను చంపిన భార్య