ETV Bharat / state

Bus accident: ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి - ap news

bus
bus
author img

By

Published : Dec 15, 2021, 12:44 PM IST

Updated : Dec 15, 2021, 6:18 PM IST

13:01 December 15

ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు

వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు

12:42 December 15

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

Bus accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్​ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదస్థలిలోనే బస్సు డ్రైవర్‌ మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మరణించినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. నీటిలో పడిన బస్సు నుంచి బయటికి రాలేకే 9 మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు.. దుర్గారావు (డ్రైవర్‌), సరోజిని (ద్వారకాతిరుమల), మధుబాబు (చిన్నంవారిగూడెం), దుర్గమ్మ (తాడువాయి), జాన్‌ (గంగవరం), సత్యవతి (నందిగూడెం), మహాలక్ష్మి (జంగారెడ్డిగూడెం), ప్రసాద్‌, బుల్లెమ్మగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్రజలు సహాయక చర్యలకు ముందుకొచ్చారు. మృతిచెందిన వారిని బస్సు కిటికీల నుంచే బయటకు తీశారు. కిటికీల నుంచి కొందరు ప్రయాణికులు బయటకు వచ్చారు. మిగిలిన ప్రయాణికులను స్థానికులు కాపాడారు. అనంతరం.. క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బస్సులోపలే ఉండిపోయినవారిని.. స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సు.. అతివేగంతో బస్సు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం, గవర్నర్ దిగ్భ్రాంతి

బస్సు ప్రమాద ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్​ను ఆదేశించారు.
విచారణకు ఆదేశం..

బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై మంత్రి విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: Jagan Illegal assets Cases: జగన్ అక్రమాస్తుల కేసులో క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకున్న దాల్మియా సిమెంట్స్

Last Updated : Dec 15, 2021, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.