ETV Bharat / state

రైస్ మిల్లులో రూ.20 కోట్ల డిపాజిట్ల గల్లంతు.. బాధితుల ఆందోళన - west godavari rice mill scam news today

అవసరాలకు పనికొస్తాయని బియ్యం మిల్లు యాజమాన్యం వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే ఏళ్ల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో డిపాజిట్​దారులు రైస్ మిల్లు వద్ద ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా మల్లిపూడి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర రైస్ మిల్లు ఎదుట అన్నదాతలు ధర్నా నిర్వహించారు.

భారీ స్కామ్:రైస్ మిల్లులో రూ.20 కోట్ల డిపాజిట్ల గల్లంతు.. బాధితుల ఆందోళన

author img

By

Published : Sep 24, 2020, 7:06 PM IST

పశ్చిమగోదావరి జిల్లా మల్లిపూడి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర రైస్ మిల్లు ఎదుట తమ డబ్బులు చెల్లించాలని అన్నదాతలు ధర్నా చేపట్టారు. మిల్లును సుందర రామిరెడ్డి, మరో భాగస్వామితో కలిసి నిర్వహించేవారు. వీరిద్దరూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయటంతో పాటు పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించారు.

మొండిచెయ్యి..

మూడేళ్ల క్రితం భాగస్వామి మృతి చెందటంతో సుందరరామిరెడ్డి ఒక్కరే బియ్యం మిల్లును నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ధాన్యం సరఫరా చేసిన రైతులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, డిపాజిట్​దారులకు మొండిచెయ్యి చూపిస్తూ వస్తున్నారు. రైతులు సరఫరా చేసిన ధాన్యానికి, వారి డిపాజిట్లకు, స్థానికుల జమ చేసుకున్న మొత్తం కలిపి సుమారు రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

బెదిరిస్తున్నారు..

రైతులు, డిపాజిట్‌ దారులు మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. డబ్బులు చెల్లించమని చెప్పేందుకు ఇద్దరు ముగ్గురు వెళ్తే బెదిరించటం, పదిమంది అంతకంటే ఎక్కువ మంది వెళ్తే ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని బాధితులు వాపోయారు. తమ వైద్య అవసరాల కోసం డిపాజిట్ సొమ్మును తిరిగివ్వమని కోరినా సమాధానం కరవవుతోందని బాధితులు కర్రి లక్ష్మి, శేషు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి : ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ బాధితుడి మృతి.. బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.