ETV Bharat / state

యువతిపై ఆర్​ఎంపీ వైద్యుని అఘాయిత్యం - పశ్చిమగోదావరిలో యువతిపై ఆర్​ఎంపీ వైద్యుడి అత్యాచారయత్నం

వైద్యం చేయించుకునేందుకు వచ్చిన యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడో ఆర్​ఎంపీ వైద్యుడు. యువతి తేరుకుని గట్టిగా కేకలు వేయటంతో బయటే ఉన్న తన తమ్ముడి సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

rmp doctor rape attempt in eluru at west godavari
యువతిపై ఆర్​ఎంపీ వైద్యుని అఘాయిత్యం
author img

By

Published : Jun 30, 2020, 2:19 PM IST

వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన ఓ యువతిపై ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువతికి ఇంజెక్షన్లు చేసి ఆమె మైకంలో ఉండగా దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తేరుకున్న ఆ యువతి తన తమ్ముడి సాయంతో అక్కడ నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వైద్యుడే ఫోన్ చేసి క్లినిక్​కు పిలిచి..

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్‌టౌన్‌ నాలుగో డివిజన్‌కు చెందిన పంతాల సత్యానంద్‌ ఆర్​ఎంపీ వైద్యునిగా వ్యవహరిస్తూ... అక్కడే క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి... ఈనెల 28న అనారోగ్యంగా ఉండటంతో తన తల్లిని తీసుకుని ఆ క్లినిక్‌కు వెళ్లింది. సత్యానంద్‌ ఇంజెక్షన్లు చేసి పంపించారు. మళ్లీ రెండవ రోజు ఆ యువతికి ఆయనే ఫోన్ చేసి క్లినిక్‌కు రావాలని.. ఇంజెక్షన్లు చేయాల్సినవి ఉన్నాయని మళ్లీ ఆలస్యమైతే బయటకు వెళ్తానని చెప్పాడు. దీంతో ఆ యువతి తన తమ్ముడిని వెంట బెట్టుకొని క్లినిక్‌కు వెళ్లింది.

గదిలోకి తీసుకువెళ్లి...

గదిలోకి తీసుకువెళ్లి ఆమెకు ఇంజెక్షన్లు చేయడంతో ఆమె కొంత మైకానికి గురికాగా... అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే తేరుకున్న యువతి అతడిని వెనక్కు నెట్టి గట్టిగా కేకలు వేస్తూ తన తమ్ముడిని పిలిచింది. అనంతరం వారిద్దరూ అక్కడ నుంచి తప్పించుకుని ఇంటికెళ్లారు.

బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... నిందితుడైన సత్యానంద్‌పై అత్యాచారయత్నం కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

మాస్క్​ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై అధికారి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.