పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు నగరంలో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలో 1120 కేసులు నమోదుకాగా.. ఏలూరు నగరంలోనే 760కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని అనేక వీధులు కొవిడ్ బారినపడి నిర్మానుష్యంగా మారాయి. వీధుల్లో జనసంచారం పూర్తిగా మందగించింది. ఆయా వీధుల్లో ప్రజలు ఐసొలేషన్‌కు వెళ్లడం, క్వారంటైన్‌కు వెళ్లడం వల్ల ఇళ్లకు తాళాలుపడ్డాయి. మిగిలినవారు భయపడి.. వీధులను ఖాళీ చేస్తున్నారు.
ఏలూరు నగరంలో కొత్తపేట, సబ్బువారివీధి, నాగేంద్రపురం, ఇందిర కాలనీ, టీచర్స్ కాలనీల్లో నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. ఈ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయడం వల్ల.. ప్రజలు ఎక్కడా కనిపించట్లేదు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలకు స్థానం లేదా?: ఎమ్మెల్యే వాసుపల్లి